ISRO Launches SSLV-D1: విజయవంతమైన ఇస్రో SSLV-D1రాకెట్ ప్రయోగం, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన భారత కీర్తి పతాక

అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్‌ఎస్‌ఎల్వీ-డీ1 రాకెట్‌ను ప్రయోగించింది.

ISRO Successfully Launches India’s Spy Satellite RISAT-2BR1 | (Photo Credits: ANI)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించింది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్‌ఎస్‌ఎల్వీ-డీ1 రాకెట్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని షార్‌ మొదటి లాంచ్‌పాడ్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎల్వీ-డీ1 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ చేపట్టిన ఈ రాకెట్‌ ప్రయోగంతో ఆ‌జా‌దీ‌శాట్‌తోపాటు ఈఓఎస్‌-02 ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవి మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ అనుసంధానికి ఉపయుక్తం కానున్నాయి.