Jammu and Kashmir: టీవీ నటిని దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులు, ఎన్‌కౌంటర్‌లో వారిని మట్టుబెట్టిన జమ్ము పోలీసులు

జమ్ము కశ్మీర్‌ టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (Amreen Bhat)ను బుద్గం జిల్లాలో టెర్రరిస్టులు కాల్చి చంపారు. అయితే వాళ్లను ట్రాప్‌ చేసిన జమ్ము పోలీసులు.. పుల్వామా జిల్లా అవంతిపోరా అగన్‌హంజిపోరా దగ్గర గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్‌ ఈ తాయిబా గ్రూప్‌ సభ్యులుగా నిర్ధారించారు.

Encounter With Naxals (Photo Credits: PTI)

జమ్ము కశ్మీర్‌ టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (Amreen Bhat)ను బుద్గం జిల్లాలో టెర్రరిస్టులు కాల్చి చంపారు. అయితే వాళ్లను ట్రాప్‌ చేసిన జమ్ము పోలీసులు.. పుల్వామా జిల్లా అవంతిపోరా అగన్‌హంజిపోరా దగ్గర గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్‌ ఈ తాయిబా గ్రూప్‌ సభ్యులుగా నిర్ధారించారు. ఎల్‌ఈటీ కమాండర్‌ లతీఫ్‌ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. శ్రీనగర్‌ సౌరా ఏరియాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో.. ఇంకో ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు ఏరిపారేశారు. గత మూడు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now