Jammu and Kashmir Bus Accident: నదిలోకి దూసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు , ఆరు మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడింది.ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు కశ్మీర్ పోలీసులు ఉన్నారు.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడింది.ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు కశ్మీర్ పోలీసులు ఉన్నారు. ఫ్రిస్లాన్ వద్ద బస్సు బ్రేక్‌లు ఫెయిలవ్వడంతో.. ఆ బస్సు నదిలోకి దూసుకువెళ్లింది. అమర్‌నాథ్ యాత్ర వద్ద విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు ఆ బస్సులో ఉన్నారు. చందన్‌వారి నుంచి పెహల్గామ్‌కు భద్రతా దళాలు ప్రయాణిస్తున్నాయి.ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు. గాయపడ్డ పోలీసుల్ని శ్రీనగర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. బస్సు ప్రమాదంలో 30 మంది సైనికులు గాయపడినట్లు అనంతనాగ్ డాక్టర్ సయ్యిద్ తారిక్ తెలిపారు.
చందన్‌వారి ప్రమాదంలో ఐటీబీపీ సైనికుల మృతి పట్ల ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని కోరారు. గాయపడ్డవారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)