Jammu & Kashmir Landslides: జమ్మూకశ్మీరులో మరోసారి విరిగిపడిన కొండ చరియలు, రోడ్లన్నీ బ్లాక్ చేసిన అధికారులు, పలు ప్రాంతాల్లో ఇండ్లు ధ్వంసం

జమ్మూకశ్మీరులో (Jammu and Kashmir)మరో సారి కొండచరియలు విరిగిపడ్డాయి.రాంబన్‌ జిల్లాలోని దుక్సర్‌ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Jammu & Kashmir landslides (Photo-ANI)

జమ్మూకశ్మీరులో (Jammu and Kashmir)మరో సారి కొండచరియలు విరిగిపడ్డాయి.రాంబన్‌ జిల్లాలోని దుక్సర్‌ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాంబన్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుక్సర్‌ దాల్వాలో ఒక చదరపు కిలోమీటర్‌ మేర కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశామన్నారు.బాధిత కుటుంబాలను టెంట్ లకు తరలించి వారికి దుప్పట్లు, వంటపాత్రలు ఇచ్చామని అధికారులు చెప్పారు.

ఆర్మీ అధికారులు బాధితులకు ఆహారం అందిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల 33కెవి పవర్ లైన్, ప్రధాన నీటి పైప్‌లైన్‌కు పెను ప్రమాదం ఏర్పడింది.సంఘటన స్థలానికి గనులు, భూగర్భశాస్త్రవేత్లు, ఇంజనీర్ల బృందాన్ని పంపించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని, త్వరలోనే కొత్త ఇండ్లను నిర్మించి ఇస్తామని జిల్లా అధికారి గుల్‌ తన్వీర్‌ వాణీ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Share Now