Jayam Ravi Divorce: భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి, డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ తప్పడం లేదని వెల్లడి

కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.

Jayam Ravi, Aarti (Photo Credits: X)

హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్‌ మోహన్‌ కుమారుడే జయం రవి. 2009లో ఆర్తిని జయం రవి వివాహం చేసుకున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయం గురించి జయం రవి ఒక నోట్‌ విడుదల చేశారు.ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. నాకు తప్పడం లేదని తెలిపారు.  టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్‌ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)