Hyderabad, Sep 8: ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడం, హైదరాబాద్ లో కుచించుకుపోయిన జలవనరులను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడికి నోటీసులు పంపింది. మురళీ మోహన్ కు (Murali Mohan) చెందిన జయభేరి (Jayabheri) సంస్థకు హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో జయభేరి సంస్థ అక్రమంగా నిర్మాణాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించి.. ఆక్రమణలు నిజమేనని తేల్చారు. జయభేరి సంస్థకు నోటీసులు అందజేశారు.
నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు ఇచ్చిన హైడ్రా
15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని నోటీసులు.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా… pic.twitter.com/d8ty8Yyb8b
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2024
15 రోజుల గడువు
15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని హైడ్రా మురళీ మోహన్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో