Illegal Mining Case: మనీలాండరింగ్‌ కేసులో సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

అక్రమ మైనింగ్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.రాంచీలోని కార్యాలయం ముందు గురువారం(నవంబర్‌ 3) విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

Jharkhand Chief Minister Hemant Soren (Photo Credits: Facebook)

అక్రమ మైనింగ్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.రాంచీలోని కార్యాలయం ముందు గురువారం(నవంబర్‌ 3) విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

కాగా ఈ కేసులో ఇప్పటికే సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పంకజ్‌పై మార్చిలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేశారు. అనంతరం గత జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.

పంకజ్ మిశ్రా, అతని వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.42 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంకజ్‌, ఇతరులపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది.విచారణ సందర్భంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఈడీ 47 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 5.34 కోట్ల నగదు, రూ. 13.32 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లను సీజ్‌ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌