Medical Termination: రేప్‌కు గురైన మైనర్ గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి, 19వారాల గర్భాన్ని తీసేయాలంటూ కోర్టును ఆశ్రయించిన బాలిక తండ్రి, రిస్క్ అయితే సంబంధం లేదని లేఖ ఇవ్వాలంటూ కోర్టు సూచన
లైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన మైనర్‌కు 19 వారాల ప్రెగ్నెన్సీని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ సమయంలో బాలికకు ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా తమ బాధ్యత కాదని, ఆమె తండ్రి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్నారు.
Srinagar, FEB 22: జమ్మూకశ్మీర్ లో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక విషయంలో కీలక తీర్పు ఇచ్చింది జమ్మూకశ్మీర్ అండ్ లడక్ హైకోర్టు. లైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన మైనర్‌కు 19 వారాల ప్రెగ్నెన్సీని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ సమయంలో బాలికకు ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా తమ బాధ్యత కాదని, ఆమె తండ్రి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. బాలిక తండ్రితో పాటూ, ఆమె లాయర్ చేసిన విజ్ఞప్తి మేరకు 19 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జావెద్ ఇక్బాల్ వని ఫిబ్రవరి 17న తీర్పు ఇచ్చారు. శ్రీనగర్ లోని మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎల్డీ ఆస్పత్రి నిపుణులకు సూచనలు చేశారు. గైనకాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ తో పాటూ, అధికారులకు సూచనలు చేశారు. తొలగించిన గర్భానికి సంబంధించిన డీఎన్ఏ పరీక్షను కూడా జరపాలని సూచించింది కోర్టు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)