Justice DY Chandrachud: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేసిన క్రమంలో ఆయన వారసుడిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు రెండేళ్ల పాటు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! జస్టిస్ వైవీ చంద్రచూడ్ అత్యధిక కాలం 1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జులై 11 వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)