Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవీ చంద్రచూడ్‌, 2024 నవంబర్ 10 వరకూ పదవిలో కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్

Justice DY Chandrachud

జస్టిస్ డీవీ చంద్రచూడ్‌ (Justice DY Chandrachud)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ భాద్యతలు చేపట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) సోమవారంనాడు ఒక ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. కొత్త సీజేఐకి అభినందనలు తెలిపారు. సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారంనాడు ఆమోదం తెలిపారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement