MLA Zameer Ahmed Khan: దళిత స్వామిజీ ఎంగిలి కూడు తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, కుల వివక్షకు తావులేదని, సోదరభావం చెప్పేందుకు ప్రయత్నం, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు.

Karnataka Cong MLA Zameer Feeds Dalit Swamiji, Asks Him to Remove Food and Eats It (Photo-ANI)

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఇద్దరూ కలిసి మెసేజ్ ఇవ్వడానికి ఈ చర్యకు దిగారు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నారు. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)