Karnataka Horror: నాలుగేళ్ళ కూతురును నాలుగో అంతస్తు నుండి కింద పడేసి హత్య చేసిన తల్లి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం, బెంగుళూరులో దారుణ ఘటన

బెంగుళూరులో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి కాసేపు నిలబడింది.

Woman Throwing Mentally Challenged Daughter From 4th Floor (Photo Credit: IANS)

బెంగుళూరులో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన గురువారం జరిగినట్లు పేర్కొన్నారు.

నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్‌ కాగా.. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పోలీసులు పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement