Kerala: వీడియో ఇదిగో, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కారు డ్రైవర్‌కి రూ. 2.5 లక్షలు జరిమానా, లైసెన్స్ కూడా రద్దు చేసిన కేరళ పోలీసులు
కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు (Licence revoked) చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్ (Thrissur)లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఓ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు (Licence revoked) చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్ (Thrissur)లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఓ కారు అంబులెన్స్ ఎంతగా హారన్ కొడుతున్నా అవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ అంబులెన్స్ ఆ కారు వెనకాలే వెళ్లాల్సి వచ్చింది.
ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించి నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. అంబులెన్స్‌కు దారి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తికి షాక్ ఇచ్చారు. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.
Car Owner in Kerala Fines INR 2.5 Lakh