Kerala: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతను చితకబాదుతున్న పోలీసులు, షాకింగ్ వీడియోని షేర్ చేసిన శశి థరూర్, ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ రోజు (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో ఒక CCTV వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేరళలోని కున్నంకుళం పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేత వి.ఎస్. సుజిత్పై పోలీసులు కస్టడీలో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ రోజు (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో ఒక CCTV వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేరళలోని కున్నంకుళం పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేత వి.ఎస్. సుజిత్పై పోలీసులు కస్టడీలో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శశిథరూర్ ఈ వీడియోను తన X ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. పోలీసుల బెదిరింపులను ప్రశ్నించినందుకు పౌరుడిపై కస్టడీలో దాడి చేయడం కేవలం చట్టవిరుద్ధమే కాదు.. అది మానవత్వానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియో 2023లో జరిగిన ఘటనకు సంబంధించినది. ఇందులో పోలీసులు స్టేషన్ లోపల సుజిత్‌పై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శశిథరూర్ మాట్లాడుతూ.. న్యాయం, గౌరవ సూత్రాలను ఉల్లంఘించే అధికారులకు పోలీసు వ్యవస్థలో స్థానం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలంటూ థరూర్ డిమాండ్ చేశారు.
Cops Assault Youth Congress Leader VS Sujith in Police Station:
Shashi Tharoor Shares Video Showing Police Brutality on VS Sujith
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)