Kisan Samman Nidhi Scheme: రైతులకు కొత్త ఏడాది కేంద్రం నుంచి శుభవార్త, జనవరి 1వ తేదీన పీఎం కిసాన్ 10వ విడత నిధులు విడుదల
రైతులకు కొత్త ఏడాది శుభవార్త.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసే సాయానికి కేంద్రం అప్ డేట్ ఇచ్చింది. జనవరి 1వ తేదీన ఈ పథకానికి సంబంధించి 10వ విడత నిధుల్ని విడుదల చేయనుంది.
రైతులకు కొత్త ఏడాది శుభవార్త.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసే సాయానికి కేంద్రం అప్ డేట్ ఇచ్చింది. జనవరి 1వ తేదీన ఈ పథకానికి సంబంధించి 10వ విడత నిధుల్ని విడుదల చేయనుంది. జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారని పీఎంవో తెలిపింది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 20 వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయనున్నట్లు పేర్కొంది.
దేశంలో అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో కేంద్రం ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేస్తోంది. ఏడాదిలో మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ 1. 6 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసినట్లు ప్రభుత్వం తెలిపింది.