Kolkata Nabanna Rally updates: ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల 'నబన్న మార్చ్', నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, గాల్లోకి కాల్పులు..వీడియోలు ఇదిగో

కోల్‌కతా సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.

Kolkata Police use water cannons as Nabanna rally turns violent

కోల్​కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన నబన్న మార్చ్‌ ఉద్రిక్తంగా మారింది. కోల్‌కతా సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.

అయితే పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరాగా బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్​, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్‌ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు గాయపడ్డారు.  వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)