Lalu's Health Condition: విషమించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం, రిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు, గుండె, మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తాయని తెలిపిన రిమ్స్ డైరెక్టర్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ గుండె, మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తాయని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్టు చెప్పారు. పశుగ్రాసం కుంభకోణం కేసుకు సంబంధించి లాలూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 1వ తేదీ వరకు విచారించలేమని ఈ నెల 11న ఝార్ఖండ్ హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఐదో పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)