IPL Auction 2025 Live

Delhi Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు, ఈ నెల 17న ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు, 5 సార్లు డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రి

ఈ నెల 17న ఈడీ ముందు హాజరు కావాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కేసులో​ ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.

Delhi CM arvind Kejriwal (Photo-ANI)

మద్యం పాలసీ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న ఈడీ ముందు హాజరు కావాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కేసులో​ ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.

ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ విచారణకు హాజరవడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆమ్‌ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా గత ఏడాది అరెస్టయి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఐదవసారి సమన్లు ​​జారీ చేసిన ఈడీ, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని స్పష్టం

Hers' ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)