Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక నిర్ణయం, వెస్ట్ బెంగాల్ డీజీపీతో సహా ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై వేటు
గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. అలాగే మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల్లోని సీనియర్ అధికారులపై కూడా వేటు వేసింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ తొలిసారిగా చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైనా కూడా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Here's News