Rahul Gandhi on His Marriage: పెళ్లి చేసుకోక తప్పేలా లేదంటున్న రాహుల్ గాంధీ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించిన కాంగ్రెస్ నేత

ఈ సభలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించారు. జనం దీనిని ప్రస్తావించగా.. ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని పేర్కొన్నారు.

Rahul Gandhi (photo-PTI)

సోమవారం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సభలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించారు. జనం దీనిని ప్రస్తావించగా.. ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని పేర్కొన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ కూడా నవ్వుతూ కనిపించారు. సభకు హాజరైన కొందరు జనం.. రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నినాదాలు చేశారు. అప్పటిదాకా సీరియస్ గా సాగిన ప్రసంగాన్ని ముగిస్తూ.. రాహుల్ దీనిపై స్పందించారు.ఇప్పుడిక నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు (అబ్ జల్దీ హి కర్నీ పడేగీ) ” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ గాంధీ.. ఐదో దశలో ఎన్నిక జరగనున్న రాయబరేలీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇది చాలా ఏళ్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం విశేషం. ఇప్పుడు అక్కడ రాహుల్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రియాంక గాంధీతో కలసి ఆయన రాయబరేలీలో ఎన్నికల ప్రచారం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)