PM Modi Kisses Child: పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతూ ఆడించిన ప్రధాని మోదీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపు
ఈ క్రమంలో ముందు కంటిచూపులేని ఓ యువతి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్రధానిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్రధాని అతడిని వారించారు. అనంతరం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.
PM Modi Kisses Child Video: లోక్‌సభ మూడో దశ పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఈ క్రమంలో ముందు కంటిచూపులేని ఓ యువతి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్రధానిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్రధాని అతడిని వారించారు. అనంతరం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.
ఆ తర్వాత ఓ వృద్ధురాలు మోదీకి ఆప్యాయంగా రాఖీ కట్టారు. ఇలా ఓటు వేసిన తర్వాత ప్రధాని మోదీ పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలతో మమేకమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)