Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, కర్ణాటకలో రూ. 5 60 కోట్ల నగదు, 106 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..
బళ్లారి (Bellary)లో ఓ నగదు వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.5.6 కోట్ల నగదు, 106 కేజీల బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి (Bellary)లో ఓ నగదు వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.5.6 కోట్ల నగదు, 106 కేజీల బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.ఈ మేరకు దుకాణం యజమాని నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 26, మే 4వ తేదీన పోలింగ్ జరగనుంది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)