Madhu ka Panchwa Baccha: ఆధార్ కార్డులో పేరు గందరగోళం, అడ్మిషన్ తిరస్కరించిన స్కూలు యాజమాన్యం, సోష‌ల్ మీడియాలో ఆధార్ కార్డు వైర‌ల్

యూపీలోని బుద్వాన్‌లో ఆధార్ కార్డుపై పేరు స‌రిగా లేని కార‌ణంగా ఓ బాలిక‌కు స్కూల్ అడ్మిష‌న్ ద‌క్క‌లేదు. బిల్సీ త‌హిశీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేశ్ త‌న కూతురు ఆర్తిని స్కూల్‌లో అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్ల‌గా.. ప్ర‌భుత్వ స్కూల్ అధికారులు ఆధార్ కార్డు కావాల‌ని అడిగారు.

No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

యూపీలోని బుద్వాన్‌లో ఆధార్ కార్డుపై పేరు స‌రిగా లేని కార‌ణంగా ఓ బాలిక‌కు స్కూల్ అడ్మిష‌న్ ద‌క్క‌లేదు. బిల్సీ త‌హిశీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేశ్ త‌న కూతురు ఆర్తిని స్కూల్‌లో అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్ల‌గా.. ప్ర‌భుత్వ స్కూల్ అధికారులు ఆధార్ కార్డు కావాల‌ని అడిగారు. అయితే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై మ‌ధు కా పాంచ్వా బ‌చ్చా అని రాసి ఉన్న‌ట్లు స్కూల్ యాజ‌మాన్యం గుర్తించింది. ఇంగ్లీష్‌లో బేబీ ఫైవ్ ఆఫ్ మ‌ధు అని కార్డుపై రాసి ఉంది. ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబ‌ర్ కూడా లేదు. కాగా పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డుల‌ను త‌యారు చేస్తున్నార‌ని, తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, బ్యాంక్ పోస్టాఫీసు అధికారుల‌కు అల‌ర్ట్ చేస్తామ‌ని జిల్లా మెజిస్ట్రేట్ దీపా రంజ‌న్ తెలిపారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఆ ఆధార్ కార్డు వైర‌ల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement