Maharashtra:  జైల్లోనే కుప్పకూలిపోయిన మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేస్తున్న వైద్యులు

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియ‌ర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మ‌ధ్యాహ్నం తీవ్ర‌ అస్వ‌స్థ‌త‌కు గురై జైల్లో కుప్ప‌కూలారు. ఆర్థూర్‌ జైలు సిబ్బంది ఆయ‌న‌ను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.

Former Maharashtra Ex Home Minister Anil Deshmukh (Photo Credits: Twitter)

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియ‌ర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మ‌ధ్యాహ్నం తీవ్ర‌ అస్వ‌స్థ‌త‌కు గురై జైల్లో కుప్ప‌కూలారు. ఆర్థూర్‌ జైలు సిబ్బంది ఆయ‌న‌ను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.కాగా మ‌నీలాండ‌రింగ్ కేసులో గ‌త ఏడాది న‌వంబ‌ర్ 2న అరెస్టైన విషయం విదితమే.

అనిల్ దేశ్‌ముఖ్ ఉన్న‌ట్టుండి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని, ఛాతిలో నొప్పిగా ఉంద‌ని చెబుతూ కుప్ప‌కూలి పోయార‌ని జైలు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం అనిల్ దేశ్‌ముఖ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని వైద్యులు చెప్పారు. ర‌క్త‌పోటు అధికంగా ఉంద‌ని చెప్పారు. చాతిలో నొప్పిగా ఉంద‌ని చెబుతుండ‌టంతో అవ‌స‌ర‌మైన వైద్య ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now