Maharashtra: రెండు రాష్ట్రాల మధ్యలో ఒకే ఇళ్లు, నాలుగు గదులు మహారాష్ర్టలో, మరో నాలుగు గదులు తెలంగాణలో, నమ్మశక్యం కాని కథనం చదువుతారా..

ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కడుతున్నారు. ఇది నమ్మశక్యం కాని నిజం. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు.

house in Maharajguda village (Photo-ANI)

ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కడుతున్నారు. ఇది నమ్మశక్యం కాని నిజం. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు. మొత్తం 10 గదులున్నాయి. నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు గదులు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలకు ఈ కుటుంబం పన్ను కడుతోంది. పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తోందని వీళ్లు బాధపడటం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement