Manipur Horror: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో దారుణ ఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.

Two Kuki-Zo Tribal Women Paraded Naked, Gang-Raped by Mob

హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో దారుణ ఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్‌) ఆరోపించింది.

ఈ సంఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి. కాగా, మే 4న జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మణిపూర్‌ పోలీసులు ఈ సంఘటనపై ఇంకా స్పందించలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

Two Kuki-Zo Tribal Women Paraded Naked, Gang-Raped by Mob

Here's Shocking Image

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement