Manipur Sexual Violence Case: సీబీఐ చేతికి మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు కేసు, కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయం
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసుపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి విదితమే. తాజాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసుపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి విదితమే. తాజాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అస్సాంలోని కోర్టు ఈ కేసు విచారణను చేపట్టే అవకాశముంది. మహిళల నగ్న ఊరేగింపును వీడియో తీసేందుకు ఉపయోగించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పార్లమెంట్‌ను సైతం ఈ ఘటన కుదిపేసింది. పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి.
Here's ANI Tweet