12 Industrial Smart Cities: దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, రూ.28,602 కోట్ల నిధులు కేటాయింపు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అంటే..
దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది. కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)