Monkeypox: గే సెక్స్ వల్ల మంకీపాక్స్ వైరస్, ఇద్దరు లైంగికంగా కలిస్తే ఎయిడ్స్ మాదిరిగా వస్తుుందని చెబుతున్న అంటు వ్యాధుల నిపుణులు

ఈ నేపథ్యంలో ఈ వ్యాధి ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఈ వ్యాధి కూడా ఎయిడ్స్ మాదిరిగా లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ముంబైకి చెందిన అంటు వ్యాధుల నిపుణుడు, హెచ్‌ఐవీ, ఎస్టీడీ కన్సల్టెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు.

Dr Gilada (photo-ANI)

దేశంలోకి మంకీపాక్స్ వైరస్ ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఈ వ్యాధి కూడా ఎయిడ్స్ మాదిరిగా లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ముంబైకి చెందిన అంటు వ్యాధుల నిపుణుడు, హెచ్‌ఐవీ, ఎస్టీడీ కన్సల్టెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు. ఇది సోకిన వ్యక్తులపై సమాజంలో ఒక రకమైన కళంకం లేదా వివక్ష కలిగించే అవకాశం ఉన్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ విషయాన్ని చెప్పడం లేదన్నారు. దేశంలో గురువారం తొలిసారిగా కేరళ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన నేపథ్యంలో ఏఎన్‌ఐ వార్తా సంస్థతో డాక్టర్ ఈశ్వర్ గిలాడా మాట్లాడారు.

పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉన్న వారిలోనే దాదాపు 99 శాతం కేసులు ఉన్నాయని తెలిపారు. ఐరోపా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లో సుమారు 80 శాతం మంకీపాక్స్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. కాగా, మంకీపాక్స్ ప్రధానంగా సన్నిహిత లేదా సన్నిహిత వ్యక్తులను కలిసిన వారి ద్వారా వ్యాపిస్తుందని డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చెప్పారు. అయితే మశూచి వ్యాక్సిన్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మంకీపాక్స్‌ను ఇది నిరోధించగలదని తెలిపారు. మరోవైపు మంకీపాక్స్‌ వ్యాప్తి, నివారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ వ్యాధి సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దన్నారు.