భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించగా, దానికి ప్రతిగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేడ్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది’ అని విజయ్ రాసుకొచ్చారు.
సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి విదితమే. పార్టీ తొలి ర్యాలీలో బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ ఈవీ రామసామి, కె.కామరాజ్ వంటి మహానేతల ఆశయాలతో పార్టీని నడిపిస్తామని ప్రకటించారు.
யாரோ சிலருக்கு வேண்டுமானால் அம்பேத்கர் பெயர் ஒவ்வாமையாக இருக்கலாம். சுதந்திரக் காற்றை சுவாசிக்கும் இந்திய மக்கள் அனைவருக்கும் அவர்கள் உயரத்தில் வைத்துப் போற்றும் ஒப்பற்ற அரசியல் மற்றும் அறிவுலக ஆளுமை, அவர்.
அம்பேத்கர்...
அம்பேத்கர்... அம்பேத்கர்...
அவர் பெயரை
உள்ளமும் உதடுகளும்…
— TVK Vijay (@tvkvijayhq) December 18, 2024
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే సిద్ధమవుతోంది. ఈ ప్రకటన అంబేద్కర్ వారసత్వం మరియు దేశ సామాజిక న్యాయ ఉద్యమాలను రూపొందించడంలో అతని పాత్ర చుట్టూ ఉన్న రాజకీయ చర్చను మరింత తీవ్రతరం చేసింది.