Mumbai: ముంబైలో విషాదం, సెప్టిక్‌ ట్యాంకులో పడి కార్మికులు మృతి, సెప్టిక్‌ ట్యాంక్‌ కూలడంతో అందులో పడి ఊపిరాడక తిరిగిరాని లోకాలకు

పబ్లిక్‌ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్‌ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్‌లో మున్సిపల్‌ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ.. ప్రమాదవశాత్తు సెప్టిక్‌ ట్యాంక్‌ కూలడంతో అందులో పడిపోయారు.

Representational Image (Photo Credits: ANI)

మహేరాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్‌ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్‌ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్‌లో మున్సిపల్‌ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ.. ప్రమాదవశాత్తు సెప్టిక్‌ ట్యాంక్‌ కూలడంతో అందులో పడిపోయారు. ఊపిరాడకపోవడంతో దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు సెప్టిక్‌ ట్యాంక్‌లోనుంచి వెలికితీవి శతాబ్ది దవాఖానకు తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)