Telangana is the ideal state for India says CM Revanth Reddy(CMO X)

Hyderabad, Nov 15: హైదరాబాద్ లో (Hyderabad) ట్రాఫిక్‌ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌ జెండర్లను (Transgender for Traffic Control) వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిగ్నల్‌ జంపింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు వీరి సేవలను ఈ మేరకు ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో వీరికి కూడా జీతభత్యాలు, ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని తెలిపారు.

2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

ప్రజాపాలనపై సమీక్ష

ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో సమీక్షించారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌ బండ్‌, సెక్రటేరియట్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.

వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు