Mumbai: ముఖేష్ అంబానీ ఇల్లు చెప్పమని అడిగారంటూ టాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్, ముకేష్ అంబానీ ఆంటిలియా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నివాసమైన 'ఆంటిలియా' వద్ద ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక టాక్సీ డ్రైవర్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ముకేష్ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నివాసమైన 'ఆంటిలియా' వద్ద ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక టాక్సీ డ్రైవర్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ముకేష్ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముకేష్ ఇంటి చిరునామా కోసం ఇద్దరు వ్యక్తులు వాకబు చేశారంటూ టాక్సీ డ్రైవర్ నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. తానొక ట్రాక్సీ డ్రైవర్‌నని, తన వాహనంలో ఎక్కిన ఇద్దరు ప్రయాణికులు అంబానీ ఇల్లు చెప్పమని అడిగారని అతను సమాచారం ఇచ్చారు. దీనిపై నిజానిజాలు నిర్ధారించుకునే ప్రయత్నాలను ముంబై పోలీసులు చేపట్టారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)