Nagarjuna Joins 'Coolie' Cast: ర‌జ‌నీకాంత్ కూలీ మూవీ నుంచి నాగార్జున ఫ‌స్ట్ లుక్ విడుద‌ల, సైమ‌న్ పాత్ర‌లో కనువిందు చేయనున్న కింగ్

Nagarjuna Joins 'Coolie' Cast

టాలీవుడ్ అగ్ర కథానాయ‌కుడు అక్కినేని నాగార్జున పుట్టిన‌రోజు సందర్భంగా  ర‌జ‌నీకాంత్ కూలీ నుంచి కింగ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. తలైవ కెరీర్‌లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఒక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ కూలీ నుంచి నాగార్జున ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. విషెస్ తెలుపుతూ.. నాగార్జున లుక్‌ను వ‌దిలారు. ఇక ఈ మూవీలో నాగార్జున సైమ‌న్‌(Simon) అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు లోకేష్ అనౌన్స్ చేశాడు. కాగా ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది. తగ్గేదేలే అంటున్న పుష్ప 2, బుక్‌మై షో యాప్‌లో మూడున్నర లక్షల మంది టికెట్ల కోసం ఎదురుచూస్తున్నట్లు క్లిక్

Here's Poster

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement