Viral Video: నాగ్‌పూర్ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం, బండిపై మనిషి ఉండగానే పైకి ఎత్తిన ట్రాఫిక్ పోలీసులు, నో పార్కింగ్‌లో బండి పెట్టాడని ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు, వీడియో వైరల్ కావడంతో క్షమాపణలు
నో పార్కింగ్ జోన్ లో స్కూటర్ పెట్టినందుకు టోయింగ్ వెహికిల్ (Towing)తో దాన్ని అమాంతం పైకి ఎత్తారు. అయితే ఆ సమయంలో బండి నడిపేవ్యక్తి దానిపైనే ఉన్నాడు. అయినప్పటికీ వదలకుండా వ్యక్తితో సహా వాహనాన్ని పైకి ఎత్తారు.
Nagpur, July 23: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో (Nagpur) ట్రాఫిక్ పోలీసులు (Traffic police) అత్యుత్సాహం ప్రదర్శించారు. నో పార్కింగ్ జోన్ లో స్కూటర్ పెట్టినందుకు టోయింగ్ వెహికిల్ (Towing)తో దాన్ని అమాంతం పైకి ఎత్తారు. అయితే ఆ సమయంలో బండి నడిపేవ్యక్తి దానిపైనే ఉన్నాడు. అయినప్పటికీ వదలకుండా వ్యక్తితో సహా వాహనాన్ని పైకి ఎత్తారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ గా (Video viral) మారింది. దాంతో టోయింగ్ చేసిన సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులపై చర్యలకు ఆదేశించారు నాగ్ పూర్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)