National Herald Case: సోనియా గాంధీని 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు, నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ రేపు హాజరు కావాలని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
సోనియాను మధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అనంతరం విచారణను కొనసాగించిన అధికారులు... నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు సంధించారు.
సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజరైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోమారు విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
తమ కార్యాలయానికి వచ్చిన సోనియాను మధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అనంతరం విచారణను కొనసాగించిన అధికారులు... నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 6 గంటల దాకా విచారణ కొనసాగగా... 6 గంటల సమయంలో మంగళవారం నాటి విచారణ ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ రేపు విచారణకు రావాలని అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)