Sharad Pawar Health Update: ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్, మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు తెలిపిన ఎన్సీపీ వర్గాలు
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సోమవారం అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ మేరకు ఎన్సీపీ ట్వీట్ చేసింది. ఆయన ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గత ఏడాది ఏప్రిల్ 11న కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స షెడ్యూల్‌కు ముందు రోజున ఆయన హాస్సిటల్‌లో అడ్మిట్ అయ్యారు. గత ఏడాది మార్చి 30న పిత్త వాహికలోకి జారిన పిత్తాశయ రాళ్లలో ఒకదాన్ని తొలగించడానికి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ చోలాంగియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) ప్రక్రియను చేయించుకున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Advertisement
Advertisement