NEET 2022: నీట్ ఎగ్జామ్‌లో విద్యార్థినుల లోదుస్తులు తొలగించిన వార్తలను ఖండించిన ఎన్టీఏ, ఈ తరహా ఘటన ఏదీ జరగలేదని తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థినుల లోదుస్తులు తొలగించినట్టు వచ్చిన ఆరోపణలను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. నీట్ ను దేశవ్యాప్తంగా నిర్వహించే బాధ్యతలను ఎన్టీఏనే చూస్తోంది.

NEET

నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థినుల లోదుస్తులు తొలగించినట్టు వచ్చిన ఆరోపణలను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. నీట్ ను దేశవ్యాప్తంగా నిర్వహించే బాధ్యతలను ఎన్టీఏనే చూస్తోంది. కేరళలోని కొల్లాం జిల్లా అయూర్ లో నీట్ పరీక్షా కేంద్రంలోకి విద్యార్థినులను లోదుస్తులతో అనుమతించలేదన్న సమాచారం వెలుగులోకి రావడం తెలిసిందే. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలపై వెంటనే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, స్వతంత్ర పరిశీలకుడు, సిటీ కోర్డినేటర్ నుంచి వివరణ తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఈ తరహా ఘటన ఏదీ జరగలేదని వారు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. సదరు నీట్ అభ్యర్థి తండ్రి ఆరోపించినట్టుగా అటువంటి చర్యలు వేటినీ ఎన్టీఏ డ్రెస్ కోడ్ కింద అనుమతించడం లేదు. నియమావళి అన్నది పరీక్ష పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకే. ఈ విషయంలో లింగపరమైన, ప్రాంతీయ, సాంస్కృతిక సున్నితత్వాలను పరిగణనలోకి తీసుకుంటూ బయోమెట్రిక్ ప్రవేశ సదుపాయాలను ఏర్పాటు చేశాం’’ అని ఎన్టీఏ ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement