Director Ajay Sastry Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్

అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.

Nenu Meeku Telusa Director Ajay Sastry Died

టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. 'నేను మీకు తెలుసా?' సినిమా ద్వారా 2008లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించారు. అజయ్ శాస్త్రి మృతి చెందిన విషయం నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసింది. టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

"నా బెస్ట్ ఫ్రెండ్, నేను మీకు తెలుసా? చిత్రం కెప్టెన్ ఇక లేరు. అజయ్ శాస్త్రి మరణవార్త నా హృదయాన్ని కలచివేసింది. ఆ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ కష్టకాలంలో అతడి కుటుంబానికి, సన్నిహితులకు మనోధైర్యాన్ని అందించాలని ఆ పరమ శివుడ్ని ప్రార్థిస్తున్నాను. అజయ్ నిన్ను మిస్ అవుతున్నాం రా. మమ్మల్ని విడిచి త్వరగా వెళ్లిపోయావ్... నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాం బాబాయ్" అంటూ మంచు మనోజ్ భావోద్వేగభరితమైన పోస్టు పెట్టారు.

Here' s Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)