New Criminal Laws: జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే క్రిమినల్ కొత్త చట్టాలు ఇవిగో..పీనల్ కోడ్ స్థానాన్ని రీప్లేస్ చేసిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య అమల్లోకి రానున్నాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించగా, గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు. తాజాగా, కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు. ఈ మేరకు నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)