Warmest Year 2024: 124 ఏండ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024.. సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువ ఉష్ణోగ్రతలు

1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది.

Temperature in Telangana (Credits: Twitter)

Newdelhi, Jan 10: 1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా (Warmest Year 2024) నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది. 1901 నుంచి 2020 వరకు నమోదైన దీర్ఘకాలిక సగటు కంటే ఇది చాలా ఎక్కువని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మొహపాత్ర తెలిపారు. అందుకే 2024 ఏడాది గత 124 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని అన్నారు. దాంతో ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదై ఉన్న 2016 రెండో స్థానానికి వెళ్లిపోయిందని చెప్పారు. 2016లో నేలపై సాధారణ కనిష్ఠ సగటు ఉష్ణోగ్రత కంటే 0.54 సెల్సియస్‌ ఎక్కువగా నమోదైందని అన్నారు.

పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now