![](https://test1.latestly.com/uploads/images/2024/11/115-30.jpg?width=380&height=214)
Hyderabad, Jan 10: పాపులర్ సినిమాలకు (Popular Movies) వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూనే రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి.తెల్లవారుజామున నాలుగు గంటల షోకు అనుమతినివ్వడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని ఈ సందర్భంగా పిటిషనర్లు వాదించారు. పుష్ప-2 సినిమా ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టు ఏమన్నదంటే?
- తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రదర్శించే సినిమాకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్తే వారి పరిస్థితి ఏమిటి?
- అంతేకాదు, రాత్రివేళ భారీగా వచ్చే జనాన్ని అదుపు చేసే విషయంలో పోలీసులపై అదనపు భారం పడుతుంది.
- ప్రదర్శనకు, ప్రదర్శనకు మధ్య 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉండటం ఏంటి?
- ఉన్న ఆ కొద్దిపాటి సమయంలో వందలమంది వాహనాలను తీసుకెళ్లడం, వచ్చేవారు పార్క్ చేయడం ఎలా కుదురుతుంది?
- 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాల్సిందే. లేకపోతే, వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.