Nitin Gadkari Faints Video: మాట్లాడుతూనే స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ వీడియో ఇదిగో, సకాలంలో చికిత్స అందదడంతో కోలుకున్న కేంద్ర మంత్రి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే స్పృహతప్పి పడిపోయారు.అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందదడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే స్పృహతప్పి పడిపోయారు.అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందదడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన - సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన యవత్మాల్ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లోక్ సభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలుగా బంఫర్ మోజారీటీతో గెలిచిన నితిన్ గడ్కరీ హ్యాట్రిక్‌పై కన్నేశారు. మహారాష్ర్టలోని నాగపుర్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న ఆయన..ఇక్కడ ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన.. కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ.. ధీమాగా చెబుతున్నారు.
Here's Video