Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా, మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ప్రతిపాదన, ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ ఓటమి
బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సభాపతిగా మరోసారి ఓంబిర్లా (Om Birla)నే గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రకటించారు.
ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది.
Here's Video