Parameswaran Iyer: నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ బాధ్యతలు స్వీకరణ, అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు

జూన్‌ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్‌ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు.

Parameswaran Iyer takes over as NITI Aayog's CEO (NITI Aayog/Twitter)

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్‌ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు. కాంత్‌కు వర్తించిన నియామక, బాధ్యతల విధివిధానాలే అయ్యర్‌కూ వర్తిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పరిగణించిన 20 బిలియన్‌ డాలర్ల స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలుకు అయ్యర్‌ గతంలో నాయకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో పని చేశారు. 2016–20 మధ్య కాలంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)