Madras HC: ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వినియోగించరాదు, సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన మ‌ద్రాస్ హైకోర్టు

ఆఫీసు ప‌ని వేళల్లో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం మొబైల్‌ను వినియోగించ‌రాదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ త‌ర‌హా నిషేధానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించాలంటూ తమిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Madurai Bench of Madras High Court (file photo)

ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్ల వినియోగించ‌రాదంటూ మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఆఫీసు ప‌ని వేళల్లో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం మొబైల్‌ను వినియోగించ‌రాదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ త‌ర‌హా నిషేధానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించాలంటూ తమిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్ర‌భుత్వం రూపొందించే స‌ద‌రు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్ఎం సుబ్ర‌హ్మ‌ణియ‌మ్ నేతృత్వంలోని బెంచ్ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)