Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరంలో పేలిన తుపాకీ, జవానుకు తీవ్ర గాయాలు, గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఫైర్
మంగళవారం సాయంత్రం సమయంలో ప్లాటూన్ కమాండర్ రామ్ ప్రసాద్ (50) (Ram Prasad) తన తుపాకీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఫైర్ అయ్యిందని చెప్పారు.
అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple) ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్లాటూన్ కమాండర్ రామ్ ప్రసాద్ (50) (Ram Prasad) తన తుపాకీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఫైర్ అయ్యిందని చెప్పారు.
దీంతో రామ్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వెంటనే అతడిని చికిత్స కోసం అయోధ్య మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని అమేథీ జిల్లా అచల్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ ప్రసాద్ గత ఆరు నెలలుగా రామజన్మభూమి ప్రాంగణంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్టు అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అయోధ్య శ్రీరాముడు లేటెస్ట్ HD ఫోటోలు ఇవిగో, ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత రామ్ లల్లా మూర్తిని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)