PM-KISAN: రైతులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ కింద రైతుల సాయం రూ. 6 వేల నుంచి 8 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా వార్తలు

రైతులకు మోదీ సర్కారు త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్‌ సమ్మాన్‌ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందని జాతీయ మీడియా CNBC తెలిపింది.

Representative Image ( Photo Credits : Wikimedia Commons )

PM-KISAN scheme amount may rise to Rs 8,000: రైతులకు మోదీ సర్కారు త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్‌ సమ్మాన్‌ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచే అవకాశం ఉందని జాతీయ మీడియా CNBC తెలిపింది.

దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్‌ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్‌ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది.

దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో పాటుగా 2020లో కరోనా మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్‌ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement