First Electric Train in Jammu: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, కశ్మీర్‌ లోయలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టిన భారత ప్రధాని

జమ్మూ-కశ్మీర్‌లో ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌ (48.1 కి.మీ.)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం ప్రారంభించారు.

PM Narendra Modi flags off the first Electric Train in the valley and also the train service between Sangaldan station & Baramulla station (photo-ANI) .

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం (T-50) అందుబాటులోకి వచ్చింది. జమ్మూ-కశ్మీర్‌లో ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌ (48.1 కి.మీ.)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ల మధ్య ‘టీ-50’ సొరంగం వస్తుంది. బారాముల్లా- శ్రీనగర్‌- సంగల్‌దాన్‌ మార్గంలో రెండు విద్యుత్‌ రైళ్లకూ జమ్మూ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపారు.

కశ్మీర్‌ లోయలో ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ. బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్‌గా నిలిచిందని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలు (క్రాస్‌ పాసేజ్‌) ఏర్పాటుచేశారు.యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టారు. మొత్తం పొడవు 272 కి.మీ.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif