PM Modi On NEET Issue: నీట్‌ పేపర్‌ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక

నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి విదితమే. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు.

PM Narendra Modi (photo-ANI)

నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి విదితమే. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.  వీడియో ఇదిగో, 543కి 99 మార్కులు తెచ్చుకుని చిన్న పిల్లోడు మురిసిపోతున్నాడు, రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ..

పేపర్ లీక్‌లు మరియు నీట్ సమస్యపై, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “దేశంలోని ప్రతి విద్యార్థికి, దేశంలోని ప్రతి యువకుడికి నేను చెబుతాను, ఇలాంటి సంఘటనలను నివారించడంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. మా బాధ్యతలను నెరవేర్చడానికి మేము ఒకదాని తరువాత మరొకటితో వస్తున్నామని యువకుల భవిష్యత్తుతో ఆటలాడుకునే వారిని వదిలిపెట్టబోమని.. నీట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నిరంతరంగా అరెస్టులు జరుగుతున్నాయన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement